: ఆఫ్రికాకు చెందిన భక్తుల వల్లే ప్రమాదం జరిగింది: సౌదీ అరేబియా
పవిత్ర మక్కాలోని మీనా వద్ద జాదిడ్ స్ట్రీట్ లో వెళ్తున్న ఆఫ్రికాకు చెందిన భక్తుల వల్లే ప్రమాదం జరిగిందని సౌదీ అరేబియా వివరణ ఇచ్చింది. జాదిడ్ స్ట్రీట్ లో సైతానుపై రాళ్లు విసిరేందుకు భక్తులంతా ఒకేసారి ఎగబడడం వల్లే తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. వెనుకనున్న భక్తులు ముందున్న భక్తులపై రాళ్లు విసిరడంతో ఈ ఆందోళన చెలరేగిందని, తద్వారా తొక్కిసలాటకు కారణమైందని సౌదీ అరేబియా పేర్కొంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, ఇరాన్, సిరియా దేశాలకు చెందిన వారని సౌదీ అరేబియా వెల్లడించింది.