: ఐక్యరాజ్యసమితి సమావేశంలో షరీఫ్ కాశ్మీర్ అంశం లేవనెత్తుతారట!
అమెరికాలోని న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేవనెత్తుతారని పాక్ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నారు. కాగా, మరి కొద్ది సేపట్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ న్యూయార్క్ చేరుకోనున్నారు. వీరిద్దరూ ఒకే హోటల్ లో బస చేస్తున్నప్పటికీ, వీరు సమావేశం అయ్యే అవకాశం లేదని ప్రధాని కార్యాలయం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి సమావేశంలో నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారని స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన సమావేశంలో కూడా నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, మోదీ ఘాటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.