: రామోజీరావును కలిసిన జగన్!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ 'ఈనాడు' అధినేత రామోజీరావును కలిశారు. 'ఈనాడు' పత్రికకు ప్రధాన ప్రత్యర్థిగా జగన్ కు సంబంధించిన జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ లో భాగమైన 'సాక్షి' కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాలలో ఈ రెండు పత్రికల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది కూడా. ఈ మధ్య పలు ఫంక్షన్లలో 'ఈనాడు' రామోజీరావును కలిసిన జగన్, తాజాగా రామోజీరావును వ్యక్తిగతంగా కలిశారు. అయితే వీరి భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాల గురించి తెలియనప్పటికీ, మర్యాదపూర్వకంగానే రామోజీరావును జగన్ కలిసినట్టు సమాచారం. వీరి కలయికపై సర్వత్ర ఆసక్తికర చర్చ నడుస్తోంది.