: నాకు నోటీసులు అందలేదు: అనిల్ కపూర్
బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ప్రముఖ సినీ నటుడు అనిల్ కపూర్ చెప్పారు. అంతేకాదు, తన నివాసానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ క్లీన్ చిట్ ఇచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతే తప్ప మీడియాలో పేర్కొంటున్నట్టుగా తన ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా, ముంబైలో డెంగ్యూ ప్రబలుతుండడంతో అపరిశుభ్రంగా ఉన్నాయంటూ పలువురు సినీ నటుల నివాసాలకు బీఎంసీ నోటీసులిచ్చిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.