: నితీష్ కు లాలూ సుప్రీంకోర్టు: వెంకయ్యనాయుడు వ్యంగ్యం
లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో నితీష్ కుమార్ కు సుప్రీంకోర్టు కాబోతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు లాంటిదని, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్రం నడుస్తోందని నితీష్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆ విధంగా కౌంటర్ ఇచ్చారు. బీహార్ లో ఎన్నికలు జరగకుండానే లాలూ తన కుమారులిద్దర్నీ మంత్రులుగా ప్రకటించేశారని వెంకయ్య ఎద్దేవా చేశారు. సాధారణంగా మంత్రులను ప్రకటించే బాధ్యత ముఖ్యమంత్రిదని ఆయన గుర్తు చేశారు. మంచి ఎవరు సూచించినా తీసుకుంటాము కానీ, తమ పరిపాలన ఎవరి నియంత్రణలోనూ ఉండదని ఆయన చెప్పారు.