: టీడీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ... మహాత్ముడికి వైసీపీ వినతిపత్రం


విజయవాడలోని మహాత్ముడి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ తమ అధినేత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆటంకాలు కలిగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వినతి పత్రంలో కోరారు. ప్రత్యేక హోదా కోసం మాట్లాడే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేత పుణ్యశీల ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై టీడీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News