: మక్కా తొక్కిసలాట ఘటనపై మోదీ స్పందన
మక్కా తొక్కిసలాట దుర్ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో స్పందించారు. మక్కా ఘటన ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. తొక్కిసలాటలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం తనను చాలా బాధించిందన్నారు. హజ్ యాత్రలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ చెప్పారు. పవిత్ర మక్కాలో ఈ మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 453 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.