: కుంభవృష్టికి గుంటూరు అతలాకుతలం!


ఈ సాయంత్రం గుంటూరులో పడ్డ కుంభవృష్టి నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడగా, పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేరకు నీరు చేరింది. మూడు ప్రాంతాల్లో గోడలు విరిగిపడి కొంత ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అటు విజయనగరంలోనూ ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అనుకోని వర్షాలు చూపిన ప్రభావంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News