: ఛారిటీ మ్యాచ్ లో ఆడినందుకు ధోనీ ఫౌండేషన్ కు 20 లక్షలు!
టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లండ్ లోని ఓవల్ లో 'క్రికెట్ ఫర్ హీరోస్' ఛారిటీ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోనీ, సెహ్వాగ్ రాణించారు. ఈ మ్యాచ్ లో ధోనీ జట్టు వరల్డ్ ఎలెవన్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా 3 కోట్ల రూపాయలు వసూలైనట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో వసూలైన మొత్తంలో సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ గాయపడిన జవాన్లను ఆదుకునేందుకు 20 లక్షల రూపాయలను ఛారిటీ మ్యాచ్ నిర్వాహకులు ధోనీ ఫౌండేషన్ కు అందజేశారు. ఈ మొత్తాన్ని ధోనీ ఫౌండేషన్ ద్వారా సరిహద్దుల్లో గాయపడిన జవాన్ల రక్షణకు వినియోగించనున్నారు.