: మరింత పైపైకి... రెండు వారాల గరిష్ఠానికి బంగారం ధర


ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టుల నుంచి కొత్తగా కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో నేడు బంగారం ధర ఏకంగా రూ. 310 పెరిగింది. ఈ సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 26,850కి చేరింది. ఇది రెండు వారాల గరిష్ఠం కావడం గమనార్హం. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 225 పెరిగి రూ. 35,400కు చేరింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,135 డాలర్లను దాటింది. వెండి ధర ఔన్సుకు 14.85 డాలర్లకు చేరింది. పండగ సీజన్ అమ్మకాలపై ఆశలు పెంచుకుంటున్న వ్యాపారులు ముందుగానే బంగారం స్టాక్ పెట్టుకుంటున్నారని, దీనికితోడు డాలర్ బలపడటం, క్రూడాయిల్ ధరల పతనం వంటి అంతర్జాతీయ స్థాయి అంశాలు సైతం ప్రభావం చూపుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News