: మక్కా తొక్కిసలాట ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి


సౌదీ అరేబియాలోని మక్కాలో ఈ మధ్యాహ్నం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన వారి యోగా క్షేమాలు తెలుసుకోవాలని తక్షణమే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ అధికారులు జెడ్డాలోని కాన్సులేట్ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో 220 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. సౌదీ పౌర రక్షణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News