: ఓటమి భయమే నన్ను నడిపిస్తోంది: అలియా భట్
జీవితంలో ఓడిపోతానన్న భయమే తనను నడిపిస్తోందని బాలీవుడ్ యువనటి అలియా భట్ చెప్పింది. అలియా భట్, షాహిద్ కపూర్ జంటగా నటించిన 'షాందార్' సినిమా అక్టోబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అలియా మాట్లాడుతూ, కెరీర్ పట్ల భయం, చేస్తున్న పని పట్ల అంకితభావం తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పింది. అభిమానుల ప్రేమాభిమానాలు జీవితంలో ఎంతో ముఖ్యమని అలియా చెప్పింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలియా 'హైవే', '2 స్టేట్స్', 'హంప్టీ శర్మ కీ దుల్హన్' సినిమాలతో హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ నటిగా కొనసాగుతోంది.