: మక్కాలో మరో భారీ విషాదం... తొక్కిసలాటలో వందమందికి పైగా మృతి


మక్కా హజ్ యాత్రలో మరో భారీ విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో వందమందికి పైగా మరణించారని తెలిసింది. 500 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ నెల 12న జరిగిన క్రేన్ కూలిన ఘటనలో 107 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. తొక్కిసలాట ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News