: సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడి కృతజ్ఞతలు


మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ కల్పించినందుకుగాను దళితుల పక్షాన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మందుల సామెల్ తెలిపారు. అంతేగాక కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జి.వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో సామెల్ మీడియాతో మాట్లాడారు. దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News