: సాగునీటి సంఘాల ఎన్నికలపై గవర్నర్ కు రఘువీరా ఫిర్యాదు


రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను రఘువీరా కోరారు. గవర్నర్ ను కలసిన వారిలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాసు కృష్ణారెడ్డి, చెంగల్రాయుడు తదితరులున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తూ పలు సాక్ష్యాధారాలను గవర్నర్ కు సమర్పించినట్టు మీడియాతో ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పారు.

  • Loading...

More Telugu News