: విశాఖ జిల్లాలో ఉపసర్పంచ్, సాక్షర భారత్ సమన్వయకర్తను కిడ్నాప్ చేసిన మావోలు
విశాఖ జిల్లా ముంచంగిపుట్ట మండలం కర్లపొదోరులో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన మావోలు, లక్ష్మీపురం ఉపసర్పంచ్ ధనుంజయ్, సాక్షరభారత్ సమన్వయకర్త వంతల నీలకంఠను అపహరించుకుపోయినట్టు తెలిసింది. మరోవైపు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తమవారిని ఎలాగైనా విడిపించాలని పోలీసులను కోరారు. కాగా ఇంతవరకూ వారి ఆచూకీ తెలియరాలేదు.