: చైనీయుల దొంగబుద్ధి... ఐ ఫోన్లు రాకముందే ఆ ఫోన్లు వచ్చేశాయి!


అది చైనాలోని టెక్ నగరం షెన్ జన్. నిత్యమూ బిజీగా ఉండే ఓ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ గాడ్జెట్స్ వీధి. అక్కడ ఉన్న స్టోర్లలో దాదాపు 30 వరకూ యాపిల్ తాజా స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ప్లస్ ల ముందస్తు బుకింగ్స్ జరుపుతున్నాయి. ఇవే షాపుల్లో యాపిల్ లోగోలు, ఐఫోన్ 6ఎస్, 6 ప్లస్ అని రాసివున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ స్టోర్లలో అత్యధికం యాపిల్ సొంతంగా నిర్వహిస్తున్న ఔట్ లెట్ల మాదిరిగానే కనిపిస్తుంటాయి. కానీ షెన్ జన్ లో యాపిల్ అధికారికంగా నిర్వహిస్తున్న స్టోర్ ఒక్కటి మాత్రమే. మరో ఐదుగురు అధీకృత డీలర్లను ఆ సంస్థ నియమించుకుంది. ఆ స్టోర్ కు ఒక కిలోమీటర్ పరిధిలో అనధికారికంగా యాపిల్ ఫోన్లను విక్రయించే స్టోర్స్ ఎన్నో ఉన్నాయి. శుక్రవారం నాడు ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల కానుండగా, అంతకు రోజుల ముందే 'ఫేక్' ఐఫోన్ 6 వెరైటీలు రంగ ప్రవేశం చేశాయి. యాపిల్ ముందస్తు ఫోన్లను కాపీకొట్టిన కొన్ని చైనా కంపెనీలు తమ దొంగబుద్ధిని చూపుతూ ఈ ఆరవ తరం వేరియంట్ ను అచ్చు గుద్దినట్టు దింపేశారు. వీటి ధర కూడా తక్కువగా ఉండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ల కోసం డిమాండ్ అధికంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు బుకింగ్స్ సంతృప్తికరంగా ఉన్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. తొలి విడతగా తాము సరఫరా చేయాలనుకున్న యూనిట్ల కన్నా అధికంగా బుకింగ్స్ వచ్చాయని, ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా ఫోన్లను బట్వాడా చేస్తామని ఆయన తెలిపారు. చైనాలో యాపిల్ ఫోన్ ప్రేమికుల సంఖ్య అధికంగా ఉందని, కానీ అక్కడ ఫేక్ ఫోన్లకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నామని ఆయన వాపోయారు.

  • Loading...

More Telugu News