: వరుణ్ సందేశ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు.. హీరోయిన్ వితిక షెరుతో త్వరలో వివాహం


టాలీవుడ్ లో మరో యువహీరో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. హ్యాపీడేస్ ఫేం వరుణ్ సందేశ్ తనతో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో నటించిన వితిక షెరును వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వరుణ్ సందేశ్, వితికల కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొగ్గతొడిగిందట. తమ మధ్య చిగురించిన ప్రేమను వారిద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పేయడమే కాక వారి నుంచి అనుమతిని కూడా పొందారట. ఇరు కుటుంబాల నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే వరుణ్ సందేశ్, వితికలు పెళ్లి పీటలు ఎక్కనున్నారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News