: రెండు దశల్లో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం: మెట్రో రైల్ ఎండీ
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు దశలుగా నిర్మాణం చేపట్టనున్నట్టు మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.65 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీపానకాలస్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ఆయన ఈ ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో పానకాలరావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పానకాల స్వామి తనకు ఆరాధనీయుడని చెప్పారు. అమరావతి మెట్రోను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.