: ఆస్కార్ కు మరాఠీ చిత్రం 'కోర్టు' నామినేట్


భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ గా జాతీయ పురస్కారం పొందిన మరాఠీ చిత్రం 'కోర్టు' ఎంపికైంది. 88వ అస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం ఈ సినిమాను అధికారికంగా ఎంపిక చేసినట్టు జ్యూరీ ఛైర్మన్ అమోల్ పాలేకర్ వెల్లడించారు. ఉత్తమ విదేశీ భాషల చిత్రాల కేటగిరీ కింద భారదేశం నలుమూలల నుంచీ వచ్చిన చిత్రాలకు ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఎంపిక బృందం ఏకగ్రీవంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్టు చెప్పారు. మొత్తం 30 చిత్రాలను ఎంపిక ప్యానెల్ తొమ్మిది రోజుల పాటు హైదరాబాదులో చూశాక చివరకు 'కోర్టు' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు పాలేకర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. కాగా, మన 'బాహుబలి' కూడా ఈ పోటీలో నిలిచినప్పటికీ, నామినేషన్ పొందలేకపోయింది.

  • Loading...

More Telugu News