: భారత ముస్లింలు గౌరవంగా ఉండాలనేదే నా కోరిక: ఒవైసీ
మహమ్మద్ అలీ జిన్నా బాటలో నడుస్తున్నారంటూ తనపై కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా చేసిన విమర్శలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తిప్పికొట్టారు. తాను భారతదేశాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ముస్లింలు మొదటి తరగతి పౌరులుగా జీవించాలని, సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. ముస్లింలలో నిరక్ష్యరాస్యత, పేదరికం పోవాలని... బాలబాలికలు అందరూ చదువుకోవాలని అన్నారు. హైదరాబాదులోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్శిటీ బీజేపీ ప్రచార కేంద్రంగా మారుతోందని ఆరోపించారు.