: అక్కడ నీరు, నిప్పు కలిసిపోయాయి!
నీరు, నిప్పు కలుస్తాయా? సాధ్యమేనా? అనే అనుమానాలు భవిష్యత్ లో వీడాల్సిందేనేమో. దుబాయ్ లో నీరు, నిప్పు కలిసిన వైనం అక్కడి వారందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. దుబాయ్ లోని మలేహా రహదారి పక్కనే ఉన్న ఎడారిలో భూమి లోపలి నుంచి నీరు, నిప్పు కలిసి ఎగసిపడుతున్నాయి. నీరు ధారగా ఎగసిపడుతుండగా, భోగి మంట స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు దుబాయ్ ప్రజలు ఎగబడుతున్నారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడుతున్నారు. అలా బంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.