: దీక్ష భగ్నం చేస్తే...నడిరోడ్డుపై ఆందోళన: అంబటి రాంబాబు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టనున్న దీక్షను భగ్నం చేస్తే...నడిరోడ్డుపై దీక్ష చేసేందుకు వెనుకాడేది లేదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, దీక్షకు సంబంధించి 80 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాక దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని అన్నారు. దీక్ష గురించి పోలీసులకు ఈ నెల 20న సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. అనుమతి నిరాకరిస్తే అప్పుడే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. వినాయక నిమజ్జనం అనే సాకు చూపుతున్నారని, నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. దీక్షను విరమించేది లేదని, పోలీసులు దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తే నడిరోడ్డుపై దీక్షను కొనసాగిస్తామని, అక్కడ కూడా అడ్డుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీక్షను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News