: హిందూపురం నుంచే పదవుల పందేరం: బాలయ్య


పార్టీలో కష్టపడ్డ ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ విషయంలో హిందూపురం నుంచే పదవుల పందేరానికి నాంది పలుకుతామని చెప్పారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్ధంగా పని చేస్తే ఆనందంగా ఉంటుందని అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. హంద్రీనీవాతో అనంతంపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ యిచ్చారు. కాగా, బాలయ్య ప్రకటనతో తమ్ముళ్లకు మరింత ఉత్సాహం వచ్చింది.

  • Loading...

More Telugu News