: కడప జిల్లాలో 13 మంది తమిళ కూలీల అరెస్టు
కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ పరిధిలోని ఇటుకుల పాడు గ్రామ సమీపంలో 13 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళ కూలీలు ఎదురుపడటంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ కూలీ పరారయ్యాడు. వారి నుంచి 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.