: రేవంత్ బెయిల్ రద్దు చేయాలని టి.ఏసీబీ పిటిషన్... రేవంత్ కు నోటీసులు
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్ కు నోటీసులు జారీ చేసింది. దసరా సెలవుల తరువాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో జూన్ 30న హైకోర్టు నుంచి రేవంత్ బెయిల్ పొందారు. ఇటీవలే ఆయనకు విధించిన షరతులను కూడా కోర్టు పూర్తిగా సడలించింది. ఈ నేపథ్యంలో హైదరాబాదు వచ్చిన రేవంత్, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో రేవంత్ షరతులు ఉల్లంఘించారని, బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.