: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి రేసులో గంగూలీ


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్ష పదవిపై కన్నేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణం పొందడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కూడా ఖాళీ అయిపోయింది. సోమవారం జరిగిన దాల్మియా అంత్యక్రియల సందర్భంగా, దాల్మియా వారసత్వాన్ని కొనసాగించాలని దాదాకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సూచించారు. స్వతహాగా బెంగాల్ లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉండటమే కాకుండా, దీదీ మద్దతు కూడా ఉండటంతో అధ్యక్ష పగ్గాలు చేపట్టడం గంగూలీకి కాస్తంత సులువుగానే కనిపిస్తోంది. అయితే, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం లేకపోవడం గంగూలీకి మైనస్ పాయింట్. ఈ తరుణంలో, మమతా బెనర్జీని గంగూలీ ఈ రోజు మరోసారి కలవబోతున్నాడు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా గంగూలీ వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News