: గుంటూరులో జగన్ దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేయతలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష ప్రాంగణానికి దగ్గరలో ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఉన్న కారణంగానే దీక్షకు అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. అంతేగాక వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్య నెలకొంటుందన్న కారణంతో తిరస్కరించారు. కాగా ఇప్పటికే దీక్షకు సంబంధించి మాజీ మంత్రి బొత్స, తదితరులు అక్కడ భూమి పూజ చేసి ఏర్పాట్లు ప్రారంభించారు. పోలీసులు అనుమతి నిరాకరించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నట్టు ఆరోపించారు.