: దేశద్రోహం నేరంపై హార్దిక్ పటేల్ సహాయకుడి అరెస్టు
పాటీదార్ పటేల్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సహాయకుడు నీలేశ్ పటేల్ ను సైబర్ క్రైం, దేశద్రోహం నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)లో కీలకంగా వ్యవహరించే నిలేశ్ పటేల్ అభ్యంతరకర పదజాలంతో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని పోలీసులు అరోపిస్తున్నారు. ఆరావళి జిల్లాలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా సభను ఏర్పాటు చేసిన హార్ధిక్ పటేల్ పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పరారైన సంగతి తెలిసిందే.