: తమిళనాడులో తెలుగు బోధనపై కార్యాచరణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం


తమిళనాడులోని పాఠశాలల్లో తెలుగు భాష చదువుకోవడానికి వీల్లేకుండా అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అక్కడి తెలుగు వారు మండిపడుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషను కంపల్సరీ చేస్తూ తీసుకొచ్చిన జీవోతో మాతృభాషను నేర్చుకోలేని పరిస్థితి అక్కడ దాపురించింది. ఈ సమస్యపై కలగజేసుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను తమిళనాడులోని తెలుగువారు కోరారు. ఈ క్రమంలో, ఈ సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంతో తమిళనాడు మంత్రి వీరమణితో ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చర్చలు జరిపారు. అంతేకాకుండా, ఈనెల 30వ తేదీన చెన్నైలో తమిళనాడు, ఏపీ విద్యాశాఖ అధికారులు దీనిపై చర్చించడానికి సమావేశం కానున్నారు. తమిళనాడులోని జనాభాలో దాదాపు 40 శాతం మంది తెలుగువారే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News