: కోడిని దొంగిలించిందని ఆమె తల నరికేశారు


కోడిని దొంగిలించిందని ఏకంగా ఓ మహిళ తలనే నరికేశారు. ఈ అమానుష ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కోళ్ల దొంగతనం విషయమై రెండు కుటుంబాల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఫాగుని (50) కుటుంబం తమ కోడిని దొంగిలించిందని మరో కుటుంబం వాదిస్తోంది. ఈ క్రమంలో ఓ పదునైన ఆయుధంతో ప్రత్యర్థి కుటుంబసభ్యులు ఫాగుని తలను నరికేశారు. ఇదే ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిలో పాలుపంచుకున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, ఫాగుని తమపై చేతబడి చేస్తోందని, అందుకే ఆమెను హతమార్చామని వారు పోలీసులకు చెప్పడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News