: మిస్ ఫైర్..యువ ఆర్మీ అధికారి దుర్మరణం


అర్జున్ ట్యాంకుల ఫైర్ డిమానిస్ట్రేషన్ శిక్షణలో అనుకోకుండా జరిగిన సంఘటనలో యువ ఆర్మీ అధికారి ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని పోఖ్రాన్ రేంజ్ లో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు..75 ఆర్మ్ డ్ రెజిమెంట్ కు చెందిన అర్జున్ ట్యాంకర్ల ఫైర్ పవర్ డిమానిస్ట్రేషన్ జరుగుతుండగా, మేజర్ ధుర్వ్ యాదవ్ వెనుక వైపు ఉన్న మరో ట్యాంకు నుంచి మిస్ ఫైర్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. మెడ భాగంలో రక్తస్రావం కావడంతో అతను మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ఆర్మీ అధికారులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. గతంలో డెహ్రాడూన్ లోని మిలిటరీ అకాడమీలో ఇన్ స్ట్రక్టర్ గా ధుర్వ్ యాదవ్ పనిచేశారు. మేజర్ ధుర్వ్ యాదవ్ భార్య ఎనిమిది నెలల గర్భవతి.

  • Loading...

More Telugu News