: 9 నిమిషాల్లో 5 గోల్స్... ఫుట్ బాల్ చరిత్రలో సరికొత్త రికార్డు
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5 గోల్స్ చేసిన రాబర్ట్ లివాండోవ్ స్కీ సరికొత్త చరిత్రను సృష్టించాడు. బైరెన్ మ్యూనిచ్, వోల్ఫ్స్ బర్గ్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. జర్మనీలో చాంపియన్స్ గా ఉన్న మ్యూనిచ్ జట్టు ఆట తొలి సగభాగం ముగిసేవరకు 0-1తో వెనుకంజలో ఉండగా, ఆ తరువాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసిన రాబర్ట్, 19 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేశాడు. పోలెండ్ కు చెందిన ఈ స్ట్రయికర్ హవా 51వ నిమిషంలో మొదలు కాగా, ఈ మ్యాచ్ లో 5-1 తేడాతో మ్యూనిచ్ జట్టు విజయం సాధించింది.