: కిష్టారెడ్డి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: కేసీఆర్


మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, కిష్టారెడ్డితో తనకు 40 ఏళ్ల నుంచి బలమైన అనుబంధం ఉందని చెప్పారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈనాటి సభాసమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం కిష్టారెడ్డి మరణం పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News