: నాగాయలంక మాజీ జడ్పీటీసీ హత్య కేసులో ఆరుగురికి జీవితకాల శిక్ష


కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక జడ్పీటీసీ మాజీ సభ్యుడు కన్నా జనార్దనరావు హత్య కేసులో ఆరుగురికి జిల్లా అదనపు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి సుబ్రహ్మణ్యం తీర్పు వెలువరించారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని విచారణలో తేలింది. దాంతో నిందితులు సైకం శ్రీనివాసరావు, వడుగు శ్రీనివాసరావు, మోకా రాంబాబు, వాడపల్లి సూరిబాబు, సైకం చంటి, నడకూడిటి మురళీకృష్ణలకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.

  • Loading...

More Telugu News