: తెలంగాణ ప్రభుత్వం కోర్టుల మాట కూడా వినట్లేదు: మంత్రి గంటా


ఏపీ విద్యార్థులకు తెలంగాణ కళాశాలల్లో ప్రవేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల మాట కూడా వినడంలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 15న కలాం పేరట ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అదే రోజు నాగార్జున వర్సిటీలో కలాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. నవంబర్ నుంచి ప్రతి నెల మొదటి సోమవారం 'డయల్ యువర్ యూనివర్సిటీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్యపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా కార్పోరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఒత్తిడే కారణంకాదని మంత్రి అన్నారు. విద్యార్థుల అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోతున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యాలయాన్ని త్వరలో నాగార్జున వర్సిటీకి తరలిస్తున్నామని గంటా వివరించారు. అంతకుముందు ఉమ్మడి విశ్వవిద్యాలయాల్లో లోపాలపై సచివాలయంలో మంత్రి గంటాకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. లోపాల పరిష్కారానికి కమిటీ పలు సిఫార్సులు చేసింది.

  • Loading...

More Telugu News