: 'కంచె' వాయిదా పడిందంటూ మెగా హీరో ట్వీట్


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన 'కంచె' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా కథానాయకుడు. ఇటీవలే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. వాస్తవానికి అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, విడుదల తేదీ వాయిదా పడింది. ఈ వివరాలను వరుణ్ తేజ్ స్వయంగా తెలిపాడు. "కంచె విడుదలను నవంబర్ 6కు వాయిదా వేశాం. దీని వెనకున్న కారణాలను త్వరలోనే వెల్లడిస్తాం" అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News