: 29కి శాసనమండలి వాయిదా
తెలంగాణ శాసనమండలి సమావేశాలను ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి మండలి సభ్యులు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంతరిక్ష, పరిశోధనారంగాల్లో అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. ఆ సంతాప తీర్మానాల అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.