: దేశంలోని హైకోర్టులను పీడిస్తున్న జడ్జిల కొరత
దేశంలోని హైకోర్టులను జడ్జిల కొరత పట్టి పీడిస్తోంది. దీంతో, లక్షలాది కేసులు పెండింగులో పడిపోతున్నాయి. వాస్తవానికి అన్ని హైకోర్టులకు కలిపి మొత్తం 1017 మంది న్యాయమూర్తుల అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం కేవలం 625 మంది జడ్జిలే ఉన్నారు. 372 మంది న్యాయమూర్తుల కొరత ఉంది. రిటైర్ అవుతున్న జడ్జిల స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. కొన్ని హైకోర్టుల పరిస్థితైతే అత్యంత దారుణంగా ఉంది. ఉండాల్సిన సంఖ్యలో కనీసం 50 శాతం మంది జడ్జిలు కూడా ఉండటం లేదు. జడ్జిల నియామక ప్రక్రియలో మార్పు చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ జ్యూడీషియల్ కమిషన్ చట్టాన్ని ఆమోదించింది. అయితే, దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో, జడ్జిల నియామకాలు పెండింగ్ లో పడ్డాయి.