: బైక్ కొంటే రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే: మద్రాసు హైకోర్టు ఆదేశాలు
కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసే వారికి తప్పనిసరిగా రెండు హెల్మెట్లు, వాటితోపాటు వాహనాలకు హెల్మెట్ లాక్ ఉండేలా చూడాలని వాహన తయారీదారులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వాహనం తయారీలో భాగంగా హెల్మెట్ లాక్ తయారు చేయాలని ఎక్స్ ట్రా ఫిటింగ్ చార్జీలు వసూలు చేయవద్దని న్యాయస్థానం సూచించింది. హెల్మెట్లు వాడకం తప్పనిసరి అయినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. హెల్మెట్ ధరించాలన్న నిబంధన పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మద్రాసు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్రంలో జూలై 1 నుంచి ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అయింది.