: అమరావతి పరిధిలోకి మరో 153 గ్రామాలు: బాబు సర్కారు ఉత్తర్వులు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ (సీఆర్డీయే) పరిధిలోకి కృష్ణా జిల్లా నుంచి 123, గుంటూరు జిల్లా నుంచి 30 గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఆర్డీయే పరిధి ప్రస్తుతమున్న 7,068.20 చదరపు కిలోమీటర్ల పరిధి నుంచి 8,352 చదరపు కిలోమీటర్ల పరిధికి పెరిగినట్లయింది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, మైలవరం, నూజివీడు, మువ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, పామర్రు, నందివాడ, గుడివాడ, నందిగామ మండలాలతో పాటు గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి, ఫిరంగిపురం, యడ్లపాడు, పత్తిపాడు, పొన్నూరు, భట్టిప్రోలు మండలాల్లోని పలు గ్రామాలను కలుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్డీయే పరిధి పెంపుతో అమరావతి చుట్టుపక్కల మరిన్ని ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News