: కొత్త 500, 1000 నోట్లు, ఎలా ఉంటాయంటే..!
దొంగనోట్ల ముద్రణకు ఎంతమాత్రమూ అవకాశం లేకుండా చూసే లక్ష్యంతో సరికొత్త రూ. 500, రూ. 1000 నోట్లను ఆర్బీఐ త్వరలో విడుదల చేయనుంది. ఈ నోట్లలో సీరియల్ నెంబర్ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మొదటి మూడు అక్షరాలతో కూడిన అంకెలను మాత్రం ఇప్పుడున్న సైజులోనే ఉంచుతారు. మిగతా అంకెల పరిమాణం పెరుగుతుంది. నోటుపై బ్లీడ్ లైన్ ఉండదు. గుర్తింపు చిహ్నాలను మరింత పెద్దవిగా ముద్రిస్తారు. దృష్టిలోపం ఉన్నవారు సులువుగా గుర్తించేందుకు ఈ నోట్లపై మార్పులు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. చేతి స్పర్శతోనే కనుగొనేలా ఈ సరికొత్త కరెన్సీ ఉంటుందని, నిర్ణీత కాల వ్యవధితో నిరంతరం కరెన్సీ ముద్రణలో మార్పులు తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించింది.