: బ్రేక్ ఫాస్ట్ కి వెంకయ్యనాయుడు ఇంటికి చంద్రబాబు
నిన్న సింగపూర్ పర్యటన నుంచి ఢిల్లీకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈ ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్లారు. చంద్రబాబును తన ఇంటికి వచ్చి అల్పాహారం స్వీకరించాలని వెంకయ్య స్వయంగా ఆహ్వానించారు. దీంతో ఆయనింటికి వెళ్లిన చంద్రబాబు అల్పాహారం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రులు సైతం వెంకయ్య ఇంటికి వెళ్లారు. వీరందరినీ ఆహ్వానించిన వెంకయ్య, సింగపూర్ పర్యటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏఏ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్న విషయాన్ని చంద్రబాబు ఆయనకు వివరించారు.