: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై భిన్న ప్రకటనలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ నేత పర్యటనపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా నిన్న రెండు రకాల ప్రకటనలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటన వ్యక్తిగతమైనదేనని సూర్జేవాలా ప్రకటించారు. అంతేకాక రాహుల్ గాంధీ లండన్ వెళ్లారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారని రణ్ దీప్ ప్రకటించారు. ఆస్పెన్ లో జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకే రాహుల్ అమెరికా వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అసలు రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఎక్కడికెళ్లారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించిన ఆయన అమెరికా పేరును ప్రస్తావించారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్న సమావేశంలో వివిధ దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాలుపంచుకుంటున్నారట.

  • Loading...

More Telugu News