: నిరూపించుకోవాలంటే అవకాశాలు రావాలి: స్టువర్ట్ బిన్నీ


టీమిండియాలో ఆటగాడు తన ప్రతిభను నిరూపించుకోవాలంటే ఎక్కువ అవకాశాలు రావాలని టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయంలో వాస్తవం మాట్లాడాడని అన్నాడు. ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు కావాల్సినన్ని అవకాశాలు రావడం లేదని బిన్నీ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో ఆడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని బిన్నీ చెప్పాడు. కొత్తబంతితో రాణించగలననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని బిన్నీ అన్నాడు. సఫారీలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బిన్నీ చెప్పాడు. సౌతాఫ్రికాతో సిరీస్ కఠినమైనదని, విజయం సాధించాలంటే నాణ్యమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు.

  • Loading...

More Telugu News