: ఫిలిప్పీన్స్ రిసార్ట్ లోంచి ముగ్గురు విదేశీయుల అపహరణ


ఫిలిప్పీన్స్ లోని ఓ రిసార్ట్ నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ కు గురయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు విదేశీయులున్నారని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... డావో నగరంలోని సమల్ ఐలాండ్ నుంచి ఇద్దరు కెనడియన్లు, నార్వేకు చెందిన రిసార్ట్ మేనేజర్, మరో స్థానిక మహిళను ఆగంతుకులు కిడ్నాప్ చేశారని చెప్పారు. బాధితులను రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ ఘటనకు కారకులుగా ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఫిలిప్పీన్స్ లోని ఉగ్రవాద ప్రాబల్యమున్న ప్రాంతంలో ఈ కిడ్నాప్ లు చోటుచేసుకోవడంతో, ఉగ్రవాదులే వారిని అపహరించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News