: బోస్ కు సంబంధించిన దస్త్రాలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన వీహెచ్ పీ


నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన దస్త్రాలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వహిందూపరిషత్ కోరింది. నేతాజీకి సంబంధించిన 64 ఫైళ్లను మమతాబెనర్జీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తేవడంపై వీహెచ్ పీ హర్షం వ్యక్తం చేసింది. నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడం అన్నది మమతాబెనర్జీ తీసుకున్న గొప్ప నిర్ణయమని వీహెచ్ పీ అభిప్రాయపడింది. నేతాజీ గురించి తెలుసుకోవడం ప్రజల హక్కు అని వీహెచ్ పీ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో లేదా ఎవరి వద్దనైనా నేతాజీకి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News