: రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో భక్తిరస చిత్రం


అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి రసచిత్రాలతో ప్రేక్షకులను మైమరపించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు మరో ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఈ భక్తిరస చిత్రం ఉంటుందని సినిమా వర్గాల సమాచారం. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ ఇప్పటికే తయారైందట. రాఘవేంద్రరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యుడిగా నియామకం అవడానికి కొద్ది నెలల ముందే ఈ భక్తి చిత్రం తీసేందుకు ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News