: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి ఉభయసభలు సంతాపం ప్రకటించనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.