: తెలంగాణ సర్కార్ కు గవర్నర్ ప్రశంసలు
ఐడీహెచ్ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చాలా బాగున్నాయని, పేదల కోసం తెలంగాణ సర్కార్ గొప్ప పనిచేస్తోదంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. బోయగూడలోని ఐడీహెచ్ కాలనీని గవర్నర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కాలనీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు వివరించారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులు ఐడీహెచ్ సీ కాలనీలో పర్యవేక్షిస్తే చాలని, పెత్తనం చేయవద్దని అన్నారు. ఎనిమిది నెలల తర్వాత మళ్లీ ఈ కాలనీని పరి శీలిస్తానని గవర్నర్ అన్నారు.